Avanti Srinivas: వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా..! 10 d ago
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పదవికి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరం గా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటాను, ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని అన్నారు.